మలాలాకు మద్దతుగా ప్రియాంక చోప్రా

మలాలాకు మద్దతుగా  ప్రియాంక చోప్రా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలాకు సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటించింది. ఆమె ఇటీవల హాస్యనటుడు హసన్ మిన్హాజ్ ను ఇన్‌స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసింది. దాన్ని సమర్థిస్తూ తాజాగా ప్రియాంక సైతం హసన్ ను అన్ ఫాలో చేస్తున్నట్టు ప్రకటించింది. రీసెంట్ గా హసన్ మలాలా తనను ఫాలో అవుతుందని, కానీ తాను మాత్రం ఫాలో కావడం లేదని చెప్పాడు. అనంతరం మలాలా అతని అకౌంట్ ను అన్ ఫాలో చేసింది.

తనను ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలో అవుతుందంటూ హసన్ చేసిన వ్యా్ఖ్యలపై స్పందించిన మలాలా.. ఆన్ లైన్ లో ఓటింగ్ పెట్టింది. అతన్ని ఫాలో చేయాలా, వద్దా, లేదంటే అసలు ఈ వ్యక్తి ఎవరు అన్న దానికి...నెటిజన్లు క్లిక్ ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. అందులో  38శాతం మంది అవును అని చెప్పగా, 39శాతం మంది ఈ వ్యక్తి ఎవరు అని దానికి ఓట్ వేశారు. ఆ తర్వాత నన్ను క్షమించండి మలాలా... నన్ను తిరిగి ఫాలో చేయండి.. కానీ తాను ఫాలో చేస్తానో..చేయనో మాత్రం తనకు తెలియదంటూ హసన్ వీడియో రిలీజ్ చేశాడు. ఈ వీడియోను చూసిన మలాలా.. ఈ వీడియోను పంపిన ప్రతి ఒక్కరికీ ధన్యావాదాలు అని.. ఈ వ్యక్తిని ఇకపై ఫాలో కాను అని తెలియజేసింది. తాజాగా ఆమెకు మద్దతు నిలుస్తూ తాను సైతం హసన్ ను అన్ ఫాలో చేసినట్టు ప్రియాంక స్ర్కీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.