వయనాడ్: జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసుల ప్రవర్తించిన తీరుపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టూడెంట్లపై జరిగిన దౌర్జన్యానికి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే దేశ ప్రజలు, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా స్టూడెంట్లు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతుంటే, ప్రధాని మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో చౌకబారు వీడియోలు చేయడంలో బిజీగా ఉన్నారని మండిపడ్డారు.
‘ఈ సంక్షోభ సమయంలో ప్రధాని ప్రవర్తన హాస్యాస్పదంగా ఉంది. దేశవ్యాప్తంగా విద్యార్థులు రోడ్లెక్కి నిరసనలు తెలిపేలా చేసినందుకు ఆయనే బాధ్యుడు. ప్రధాని దేశ ప్రజలకు జవాబు చెప్పాలి. పార్లమెంటుకు వచ్చి విద్యార్థులు కోరుతున్న మార్పులను అమలు చేయాలి’ అని డిమాండ్ చేశారు.
