సెల్ఫ్​హెల్ఫ్​ గ్రూపులకు రుణమాఫీ.. గ్యాస్​ సిలిండర్​పై రూ.500 సబ్సిడీ

సెల్ఫ్​హెల్ఫ్​ గ్రూపులకు రుణమాఫీ.. గ్యాస్​ సిలిండర్​పై రూ.500 సబ్సిడీ

జల్బంధ: చత్తీస్‌‌గఢ్‌‌లో కాంగ్రెస్ పార్టీని మరోసారి గెలిపిస్తే స్వయం సహాయక సంఘాల రుణాలు మాఫీ చేస్తామని, గ్యాస్​సిలిండర్​పై రూ.500 సబ్సిడీ ఇస్తామని ఆ పార్టీ అగ్రనేత  ప్రియాంక గాంధీ వాద్రా హామీ ఇచ్చారు. సోమవారం ఖైరాగఢ్ అసెంబ్లీ సెగ్మెంట్‌‌లోని జల్బంధ వద్ద నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. 

చత్తీస్‌‌గఢ్‌‌లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే.. గ్యాస్ సిలిండర్‌‌పై రూ.500 సబ్సిడీని అందించేందుకు మహిళల కోసం కొత్తగా మహతారీ న్యాయ్ యోజన పథకంను ప్రారంభిస్తామని ప్రియాంక చెప్పారు. అలాగే, రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారికి  ముఖ్యమంత్రి ప్రత్యేక ఆరోగ్య సహాయ పథకం కింద ఉచితంగా వైద్యం అందజేస్తామని ఆమె తెలిపారు. దాదాపు 6 వేల ప్రభుత్వ హయ్యర్ సెకండరీ, హైస్కూళ్లను స్వామి ఆత్మానంద ఇంగ్లిష్​, హిందీ మీడియం పాఠశాలలుగా అప్‌‌గ్రేడ్ చేస్తామని తెలిపారు.