
హైదరాబాద్, వెలుగు: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈ నెలాఖరున కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు పార్టీ ముఖ్య నేత ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. ఈ నెల 31న జిల్లాలోని కొల్లాపూర్‌లో ‘పాలమూరు ప్రజాభేరి’ పేరిట ఈ సభను నిర్వహించనున్నారు. సభ ఏర్పాట్లకు సంబంధించి ఆదివారం మల్లు రవి నివాసంలో కాంగ్రెస్ నేతలు జూపల్లి కృష్ణారావు, జగదీశ్వర్ రావు, ప్రతాప్ గౌడ్, విజయ్ భాస్కర్ రెడ్డి సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.