పార్లమెంట్ ఎవరి సొంత జాగీర్ కాదు...కేంద్ర వైఖరిపై ప్రియాంక గాంధీ ఫైర్

పార్లమెంట్ ఎవరి సొంత జాగీర్ కాదు...కేంద్ర వైఖరిపై ప్రియాంక గాంధీ ఫైర్

న్యూఢిల్లీ: ఢిల్లీలో నిరసన తెలుపుతు న్న విద్యార్థులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీచార్జ్ చేయడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంట్ ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కేంద్రం వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు.

"బాధ్యతారాహిత్యంగా విద్యార్థులపై దళాలను ఉపయోగించడం దారుణం. వీరంతా మన పిల్లలు, మన దేశ భవిష్యత్తు. పార్లమెంట్ అనేది ఈ దేశ ప్రజలది, విద్యార్థులది.. ఇది ఎవరి సొంత జాగీర్​ కాదు. విద్యావ్యవస్థలోని లోపాలను ప్రశ్నిస్తే విద్యార్థులను కొడతారా..?" అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.