తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోంది: ప్రియాంక గాంధీ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోంది: ప్రియాంక గాంధీ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని ప్రియాంక గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 2023, నవంబర్ 28వ తేదీ మంగళవారం మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ నిర్వహించిన రోడ్ లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పాల్గొన్నారు. ఈ రోడ్ షోలో రాజస్థాన్ ముఖ్యమంత్రి, కేసీ వేణుగోపాల్,  రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ  సందర్భంగా ప్రియాంక గాంధీ..  జై బోలో తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

 ప్రియాంక గాంధీ ప్రసంగంలో హైలెట్స్

 

  • పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు.
  • బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందా?
  • కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు వచ్చాయి.
  • కేసీఆర్ ప్రభుత్వం మీకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చిందా?
  • దేశంలోనే ఎక్కడా లేదు.. తెలంగాణలోనే ఫాంహౌస్ సర్కార్ నడుస్తోంది.
  • మీకు దొరల తెలంగాణ కావాలా?.. ప్రజల తెలంగాణ కావాలా?
  • మీ ఓటుతోనే మీ భవిష్యత్ ఉంటుంది. 
  • కేసీఆర్ అవినీతి ప్రభుత్వాన్ని  ఇంటికి పంపే సమయం వచ్చింది
  • తెలంగాణ ప్రజల బతుకులు మారాలంటే కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించండి
  • కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో  అన్ని వర్గాల ప్రజలకు అబ్ధి జరుగుతుంది.

 రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు:

 

  • తెలంగాణను కేసీఆర్ సర్వనాశనం చేశాడు.
  • త్యాగాల పునాదులపై ఏర్పడి తెలంగాణను.. మోసాల తెలంగాణగా మార్చారు.
  • నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో  కేసీఆర్ ను బొంద పెట్టాలి.
  • ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించేందుకు  మీరంతా సిద్ధమేనా?.
  • కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి.