న్యూఢిల్లీ: బెంగాల్లో రేప్, హత్యకు గురైన మహిళ డాక్టర్ కు న్యాయం జరిగేలా చూడాలని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కోరారు. సోమవారం ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.
ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ రేప్, హత్యకు గురైన ఘటన బాధించింది. వర్క్ ప్లేసేస్ లో మహిళలకు భద్రత కల్పించాలి. దీని కోసం గట్టి ప్రయత్నాలు చేయాలి. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోని బాధిత కుటుంబం, తోటి డాక్టర్లకు న్యాయం చేయాలి” అని తెలిపారు.