జులై 20న కొల్లాపూర్​లో ప్రియాంక గాంధీ సభ వాయిదా..

జులై 20న కొల్లాపూర్​లో ప్రియాంక గాంధీ సభ వాయిదా..

నాగర్​కర్నూల్, వెలుగు : ఈనెల 20న కొల్లాపూర్​లో భారీ బహిరంగ సభ నిర్వహించి ఏఐసీసీ నాయకురాలు ప్రియాంకగాంధీ సమక్షంలో పార్టీలో చేరాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్ని సిద్ధం చేసుకోగా, ఆ  సభ వాయిదా పడినట్లు తెలిసింది. ప్రియాంకగాంధీ బిజీ షెడ్యూల్​ కారణంగా డేట్స్ అడ్జస్ట్​ కాకపోవడంతో ఆమెకు బదులుగా ఏసీసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హాజరవుతారని ప్రచారం జరిగింది. ప్రియాంక స్థానంలో ఖర్గే వస్తే ఆశించిన స్థాయిలో జనసమీకరణ, కార్యకర్తల్లో ఊపు రాదన్న భయంతో వాయిదాకు మొగ్గు చూపినట్లు సమాచారం. అంత ఖర్చు చేసి సభ నిర్వహించినా పాజిటివ్ ​రెస్పాన్స్​ రాకపోతే ఎలక్షన్స్​ వరకు జోష్​ను క్రియేట్​ చేయడం, కొనసాగించడం కష్టమేనన్న అభిప్రాయానికి వచ్చిన తర్వాత వాయిదా వేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. సభ కోసం జూపల్లి, తదితరులు ఈనెల10న సభా స్థలాన్ని కూడా పరిశీలించారు.

ALSO READ :కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఫోకస్​ తగ్గిందా!

 స్టేజీ, పార్కింగ్ ఏర్పాట్లతో పాటు కొల్లాపూర్, నాగర్​కర్నూల్​, అచ్చంపేట, వనపర్తి, గద్వాల నుంచి 3 లక్షల మందిని తరలించేలా టార్గెట్ ​పెట్టుకున్నారు. కానీ, ఇంతలోనే వాయిదా పడడంతో నిరుత్సాహానికి గురయ్యారు. అయితే, సభను ఈనెల చివరి లోపే నిర్వహించే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. రేవంత్​ సమక్షంలో చేరనున్న జడ్పీ చైర్ ​పర్సన్​20న కొల్లాపూర్​సభలో పార్టీలో చేరాలనుకున్న గద్వాల జడ్పీ చైర్​పర్సన్​ సరిత తిరుపతయ్య ఆ సభ వాయిదాతో ఈనెల 18న పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి సమక్షంలో పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.