V6 News

PL 2026: ప్రియాన్ష్ ఆర్య భారీ సిక్సర్‌‎కు పగిలిన తాత‌ ముఖం.. బోలబోల కారిన రక్తం

PL 2026: ప్రియాన్ష్ ఆర్య భారీ సిక్సర్‌‎కు పగిలిన తాత‌ ముఖం.. బోలబోల కారిన రక్తం

క్రికెట్ అంటే ఇండియన్స్‎కు పిచ్చి. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నారుల నుంచి పండు ముసలి వరకు క్రికెట్‎ను ఆస్వాదింస్తుంటారు. కొందరు తమ అభిమాన ప్లేయర్ల ఆటను కళ్లారా చూసేందుకు స్టేడియాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వెళ్లిన ఓ వృద్ధ క్రికెట్ అభిమానికి చేదు అనుభవం ఎదురైంది.

క్రికెటర్ కొట్టిన భారీ సిక్సర్ నేరుగా వచ్చి ముఖానికి తగలడంతో తాత ముఖం పగిలింది. రక్తం బోలబోల కారింది. దీంతో వెంటనే తోటి అభిమానులు అతడినికి ఆసుపత్రికి తరలించారు. ఈ విషాదకరమైన ఘటన మంగళవారం (ఏప్రిల్ 28) రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచులో చోటు చేసుకుంది. 

ఐపీఎల్ 19లో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 28) రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ముల్లాన్‎పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో పంజాబ్ యువ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య కొట్టిన భారీ సిక్సర్‎కు స్టేడియంలోని ఓ ప్రేక్షుకుడి ముఖం పగిలి తీవ్ర రక్తస్రావమైంది. పంజాబ్ ఇన్నింగ్స్‎లో ఆర్ఆర్ బౌలర్ నండ్రే బర్గర్ వేసిన రెండో ఓవర్‌ మూడు బంతిని ప్రియాన్ష్ ఆర్య డీప్ ఎక్స్‌ట్రా కవర్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. 

ఈ క్రమంలో బంతి నేరుగా ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చొన ఓ వృద్ద అభిమాని ముఖానికి బలంగా తగిలింది. బంతి బలంగా తగలడంతో అతడి ముఖానికి తీవ్ర గాయమై రక్తం బోలబోల కారింది. వెంటనే పక్కనున్న తోటి ప్రేక్షకుల అతడికి సహయం చేశారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. 

ప్రియాన్ష్ ఆర్య కొట్టిన భారీ సిక్సర్ కు ప్రేక్షుకుడి ముఖం పగిలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. బంతి అందుకోవాలనే ఆతృతలో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కొందరు సూచిస్తుండగా.. ఇకపై ఆడియెన్స్ కూడా స్టేడియానికి హెల్మెట్ ధరించి వెళ్లాలంటున్నారు ఇంకొందరు. 

పంజాబ్ జైత్రయాత్రకు బ్రేక్:

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐపీఎల్–19లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. మెగా లీగ్ లో ఒక్క ఓటమి లేకుండా దూసుకెళ్తున్న ఆ టీమ్కు రాజస్తాన్ రాయల్స్ చెక్ పెట్టింది. ఛేజింగ్లో డొనోవాన్ ఫెరీరా (26 బాల్స్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 52 నాటౌట్), యశస్వి జైస్వాల్ (27 బాల్స్లో 7 ఫోర్లు, 1 సిక్స్త్ 51), వైభవ్ సూర్యవంశీ (16 బాల్స్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 43), దంచికొట్టడంతో.. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్లో రాజస్తాన్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ పై గెలిచింది.

టాస్ ఓడిన పంజాబ్ 20 ఓవర్లలో 222/4 స్కోరు చేసింది. మార్కస్ స్టోయినిస్ (22 బాల్స్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 62 నాటౌట్), ప్రభ్సిమ్రన్ సింగ్ (44 బాల్స్లో 6 ఫోర్లు, 1 సిక్స్త్ 59 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. తర్వాత రాజస్తాన్ 19.2 ఓవర్లలో 228/4 స్కోరు చేసి గెలిచింది. ఫెరీరాకు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.