
‘మొదటి సినిమాకు ఏ నిర్మాత అయినా సేఫ్ సైడ్ చూసుకుంటారు. అలా నేను వరలక్ష్మీ గారిని నమ్మాను’ అని చెప్పారు నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల. వరలక్ష్మీ శరత్ కుమార్ ఫిమేల్ లీడ్‌గా అనిల్ కాట్జ్ దర్శకత్వంలో ఈయన నిర్మించిన చిత్రం ‘శబరి’. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మే 3న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా మహేంద్రనాథ్ మాట్లాడుతూ ‘మంచి కథ, మంచి క్యారెక్టర్లను సెలెక్ట్ చేసుకుంటారు వరలక్ష్మీ. ఆవిడ ఓకే చేశారంటే 50 పర్సెంట్ నేను సేఫ్ అని ఈ సినిమాకు ఓకే చెప్పా.
బిడ్డ కోసం తల్లి పడే తపనను తీసుకుని సైకలాజికల్ థ్రిల్లర్‌గా అనిల్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. తల్లీకూతుళ్ల సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయ్యింది. ప్రతి ఇంట్లోనూ ఈ పాయింట్ కనెక్ట్ అవుతుంది. కొత్త నిర్మాతగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా.. వరలక్ష్మీ బాగా సపోర్ట్ చేశారు. బడ్జెట్ పెరగకుండా కేర్ తీసుకున్నారు. ఆవిడతో ఎంత మంచి రిలేషన్‌షిప్ ఉందంటే.. మా బ్యానర్‌లో మరో సినిమా చేస్తానని చెప్పారు. నెక్స్ట్ వరుణ్ సందేశ్ హీరోగా నా రెండో సినిమా ప్రొడక్షన్‌లో ఉంది. అలాగే ‘బిగ్ బాస్’ ఫేమ్ అమర్ దీప్, సురేఖా వాణి కుమార్తె సుప్రీత జంటగా మూడో సినిమా చేస్తున్నా’ అని అన్నారు.