హైదరాబాద్, వెలుగు: సోషల్ మీడియాలో తనకు వస్తున్న బెదిరింపులపై తగిన చర్యలు తీసుకోవాలని రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ డీజీపీ సీవీ ఆనంద్‌ను కోరారు. తనను అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన డీజీపీని కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తనకు వస్తున్న బెదిరింపుల దృష్ట్యా అవసరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్టు చెప్పారు.
జనసేనపార్టీపై తాను చేసిన వ్యాఖ్యలను ఇప్పటికే విత్‌డ్రా చేసుకున్నానని, ఆ పార్టీ సైతం దాన్ని స్వాగతించిందని పేర్కొన్నారు. ఇది ముగిసిన అధ్యాయమని, దీనిపై ఏమీ మాట్లాడవద్దని పార్టీ కేడర్‌కు సైతం సూచించిందని వివరించారు. అయితే, ఈ కేసుకు సంబంధించి ఏపీ పోలీసులు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని వెల్లడించారు.
