Project K:ప్రభాస్..దీపికా పదుకొణె ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

Project K:ప్రభాస్..దీపికా పదుకొణె ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రాజెక్ట్ కె మేకర్స్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ప్రభాస్ ఫ్యాన్స్ కు సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసి.. ఈ పండుగ రోజు మరింత ఆనందాన్ని పొందేలా చేశారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ప్రాజెక్ట్ కెను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్ర నిర్వాహకులు వెల్లడించారు. దాంతో ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన ఓ పోస్టర్ మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ఎడారిలో ఓ భారీ చేతిని స్నిపర్స్ జాగ్రత్తగా చూస్తున్నట్టుగా ఉన్న ఈ పోస్టర్ ప్రస్తుతం అందర్నీ ఆకర్షిస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెతో పాటు అమితాబ్ బచ్చన్ కూడా కీలకపాత్రలలో నటిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నారు. కాగా ఈ చిత్రాన్ని మేకర్స్ పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు.