సీతారామ ప్రాజెక్టు భూసేకరణకు సహకరించాలి : ప్రాజెక్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సదానందం 

సీతారామ ప్రాజెక్టు భూసేకరణకు సహకరించాలి : ప్రాజెక్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సదానందం 

కామేపల్లి, వెలుగు : సీతారామ ప్రాజెక్టు కాలువల కింద భూములు కోల్పోయే రైతులకు మెరుగైన నష్టపరిహారం అందిస్తామని, భూసేకరణ సర్వేకు సహకరించాలని సీతారామ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సదానందం కోరారు. బుధవారం కొమ్మినేపల్లి జీపీ ఆఫీస్​లో కొండాయిగూడెం, కొమ్మినేపల్లి రెవెన్యూ గ్రామాల రైతులతో నిర్వహించిన అవగాహన సభలో ఆయన మాట్లాడారు. రూ.2 వేల కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా 10 వేల ఎకరాలకు గోదావరి జలాలు అందనున్నాయని తెలిపారు. భూమి విలువకు అదనంగా మూడు రెట్లు పరిహారం చెల్లించడంతో పాటు, భూమిపై ఉన్న ఆస్తులకు కూడా నష్టపరిహారం అందిస్తామని చెప్పారు.