
ప్రముఖ టీవీ న్యూస్ యాంకర్.. తొలితరం ఇంగ్లీష్ న్యూస్ ప్రజెంటర్ గీతాంజలి అయ్యర్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. దాదాపు 30 ఏళ్లుకుపైగా జాతీయ మీడియా ఛానెళ్లలో పనిచేశారు గీతాంజలి . 1971లో దూరదర్శన్‌లో చేరిన ఆమె నాలుగుసార్లు బెస్ట్ యాంకర్ అవార్డును అందుకున్నారు. ఆమె పనితీరుకు గానూ అత్యుత్తమ మహిళలకు అందించే ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డును 1989లో అందుకున్నారు.
గీతాంజలి అయ్యర్ ఇంగ్లీష్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కోల్‌కతాలోని లోరెటో కాలేజీ నుండి పట్టభద్రురాలైంది. ఆమె నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుండి డిప్లొమా కూడా చేసింది. దూరదర్శన్ కెరీర్ ముగిశాక.. కార్పొరేట్ రంగం వైపు అడుగులు వేశారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో పని చేసిన ఆమె.. ఖాందాన్ అనే సీరియల్‌లోనూనటించారు. గీతాంజలి అయ్యర్ మృతిపై దూరదర్శన్ సిబ్బంది సంతాపం తెలిపారు.