వర్సిటీ క్యాంపస్​లోనే ఉంటా.. కారుపై కాదు దమ్ముంటే నాపై దాడి చేయండి

వర్సిటీ క్యాంపస్​లోనే ఉంటా.. కారుపై కాదు దమ్ముంటే నాపై దాడి చేయండి

న్యూఢిల్లీ :  కొన్ని రోజుల క్రితం తన కారుపై ఎస్ఎఫ్ ఐ నాయకులు దాడి చేయడంతో కేరళ గవర్నర్ మహ్మద్ అరిఫ్ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాలికట్ యూనివర్సిటీ క్యాంపస్ లోకీ తనను ప్రవేశించకుండా అడ్డుకుంటామని స్టూడెంట్ యూనియన్ నాయకులు హెచ్చరించడంతో అక్కడే  విడిది చేయాలని గవర్నర్ నిర్ణయించుకున్నారు. తన ప్రోగ్రామ్స్ ను మార్చాలని సిబ్బందికి సూచించారు. 

శనివారం న్యూఢిల్లీలో విలేకర్లతో గవర్నర్ మాట్లాడారు. వారికి ధైర్యం ఉంటే కారుపై కాదు తనపై దాడి చేయాలని చాలెంజ్ చేశారు. తాను బెదిరిస్తే బెదిరిపోయే రకం కాదని చెప్పారు. స్టూడెంట్స్ యూనియన్ నాయకులు కానీ మరెవరైనా కానీ సీఎం కారు సమీపంలోకి వెళ్లగలరా అని గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రశ్నించారు. కాగా, కొన్ని రోజుల క్రితం ఆయన తిరువనంతపురం ఎయిర్ పోర్టుకు కారులో వెళ్తుండగా ఎస్ఎఫ్ఐ నాయకులు ఆయన కారును అడ్డగించారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.