గాంధీ పేరు తొలగింపుపై ధర్నా

గాంధీ పేరు తొలగింపుపై ధర్నా

బషీర్​బాగ్, వెలుగు: మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ పథకం నుంచి తొలగించడాన్ని ఖండిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్​రామ్ విగ్రహం వద్ద శనివారం ధర్నా నిర్వహించారు.

ఈ సందర్బంగా ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ డా. పిడమర్తి రవి మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని, ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాజీవ్ గాంధీ ఫెలోషిప్​కు సంబంధించి యూజీసీ కొత్త విధానాన్ని కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.