జన్నారం, వెలుగు: మంచిర్యాల జిల్లా జన్నారం గ్రామంలో ఆదివాసీ మహిళ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తుడుందెబ్బ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మనోజ్ మాట్లాడుతూ జన్నారం గ్రామానికి చెందిన సోయం పారుబాయికి సర్వే నంబర్ 79, 80లో -35 గుంటల భూమి ఉందని, దానిని జన్నారంకు చెందిన కొందరు గిరిజనేతరులు కబ్జా చేసి అమ్మేందుకు యత్నిస్తున్నారని తెలిపారు.
అంతకుముందు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ బక్కయ్య హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
