ఎమ్మెల్యే క్యాంప్ ​ఆఫీసులో పాముతో నిరసన

ఎమ్మెల్యే క్యాంప్ ​ఆఫీసులో పాముతో నిరసన

సికింద్రాబాద్, వెలుగు: తమ ప్రాంతంలో పాముల బెడద ఎక్కువైందని, కాపాడాలంటూ అడ్డగుట్ట వాసులు సోమవారం సికింద్రాబాద్​ఎమ్మెల్యే పద్మారావుగౌడ్​క్యాంప్ ఆఫీసులో ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే టేబుల్​పై సీసాలో పట్టుకుని తెచ్చిన పామును ఉంచి నిరసన తెలిపారు. అడ్డగుట్టలో కుప్పలుగా పోస్తున్న భవన నిర్మాణ వ్యర్థాలను తొలించడం లేదని, దాని చుట్టూ స్థానికులు చెత్త తెచ్చిపోస్తున్నారని వాపోయారు. దోమలతోపాటు పాముల సంచారం పెరిగిపోయిందని వాపోయారు. స్పందించిన ఎమ్మెల్యే జీహెచ్ఎంసీ అధికారులతో ఫోన్​లో మాట్లాడారు. 24 గంటల్లో సమస్యను పరిష్కరించాలని, చెత్త, చెదారం తొలగించాలని సూచించారు. అవసరమైతే స్నేక్ క్యాచర్స్ ను అందుబాటులో ఉంచాలని చెప్పారు.