శ్రద్ధ ఘటనపై మహారాష్ట్రలో నిరసనలు

శ్రద్ధ  ఘటనపై మహారాష్ట్రలో నిరసనలు

ముంబయి: ప్రేమించినోడని నమ్మి వచ్చిన శ్రద్ధను ఆఫ్తాబ్ చంపేసిన ఘటనపై మహారాష్ట్రలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మహిళా సంఘాలు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలతో హోరెత్తిస్తూనే ఉన్నాయి.  

తాజాగా ఇవాళ  రాయ్ గఢ్​ లో  హిందూ ఆర్గనైజేషన్లు  నిరసన చేపట్టాయి.  శ్రద్ధ మర్డర్  కేసులో నిందితుడు  ఆఫ్తాబ్ పై   వెంటనే చర్యలు  తీసుకోవాలంటూ  ర్యాలీ నిర్వహించారు. ఆఫ్తాబ్​ ను వెంటనే ఉరి తీయాలంటూ నినాదాలు చేశారు. పెళ్లి  చేసుకోమన్నందుకు  శ్రద్ధను ఆఫ్తాబ్  చంపేశాడంటూ  మండిపడ్డారు.

ప్రేమించి ఇష్టపడి వచ్చిన  శ్రద్ధపై కోపంతో చంపేసింది చాలక.. కసాయి కంటే దారుణంగా ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా  చేసి  క్రూరంగా ప్రవర్తించాడంటూ  ఆగ్రహం వ్యక్తం  చేశారు. ఆఫ్తాబ్ లాంటి  క్రిమినల్ కు వెంటనే  శిక్ష వేయాలని డిమాండ్  చేశారు.