కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి : పీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ, ఇతర సంఘాల లీడర్లు

కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి : పీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ, ఇతర సంఘాల లీడర్లు
  •      ఉమ్మడి వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఖమ్మం జిల్లాల్లో నిరసనలు 

హనుమకొండ సిటీ/మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/తొర్రూరు/ఖమ్మం టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/అశ్వారావుపేట, వెలుగు: నీట్ పేపర్ లీకేజీకి కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని పీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ, ఇతర సంఘాల లీడర్లు డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిరసిస్తూ గురువారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ ఉమ్మడి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అజయ్, మహేశ్ మాట్లాడుతూ దేశంలో పోటీ పరీక్షల పేపర్లను రూ.కోట్లకు అమ్ముకుంటూ పేద విద్యార్థుల పొట్ట గొడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని  మహబూబాబాద్​ ఎమ్మెల్యే  భూక్యామురళీ నాయక్ డిమాండ్​ చేశారు. 

కేసముద్రం పట్టణ కేంద్రంలో కాంగ్రెస్​ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటమాడుతోందన్నారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గాంధీ, ప్రియాంకగాంధీ అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు నిరసనగా తొర్రూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఖమ్మంలో సీపీఐ(ఎంఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) మాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ విద్యార్థులపై ఢిల్లీలో పోలీసుల దమనకాండను ఖండిస్తున్నామన్నారు.