మంత్రి హరీష్రావు పర్యటనలోప్రొటోకాల్ గొడవ

మంత్రి హరీష్రావు పర్యటనలోప్రొటోకాల్ గొడవ
  • శిలాఫలకంపై పేరులేదంటూ ధ్వంసం 
  • కాంగ్రెస్ కౌన్సిలర్ దంపతుల అరెస్ట్

అబ్దుల్లాపూర్మెట్,వెలుగు: మంత్రి పర్యటనలో ప్రొటోకాల్ గొడవ జరిగింది. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీలో గురువారం మంత్రి హరీశ్​రావు పర్యటించారు. శిలాఫలకంపై తన పేరు లేదని కాంగ్రెస్ కౌన్సిలర్ మంగమ్మ, ఆమె భర్త శివకుమార్ నిరసన చేపట్టారు. వీరికి మద్దతుగా మున్సిపల్ చైర్మన్ అనురాధ, వైస్ చైర్మన్ హరిత, కౌన్సిల్ సభ్యులు రేవల్లి హరిత యాదగిరి, ఉదయశ్రీ, మేతరి అనురాధ దర్శన్, కంబలపల్లి ధన్ రాజ్, బాల్ రాజ్, శివలింగం గౌడ్, ఐలయ్య నిరసన తెలిపారు.  అధికారుల తీరును నిరసిస్తూ శిలాఫలకాన్ని కౌన్సిలర్ మంగమ్మ, ఆమె భర్త శివకుమార్ ధ్వంసం చేశారు. దీంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కోర్టు ముందు హాజరు పరచగా బెయిల్ మంజూరు చేసింది.