కట్ట కవితకు మెరుగైన వైద్యం అందించండి: మంత్రి దామోదర రాజనర్సింహ

కట్ట కవితకు మెరుగైన వైద్యం అందించండి: మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన సీనియర్ జర్నలిస్ట్ కట్ట కవితకు మెరుగైన వైద్యం అందించాలని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్‌ను ఆరోగ్యశాఖ మంత్రి దామోదరత రాజనర్సింహ ఆదేశించారు. 

శనివారం (సెప్టెంబర్ 06) సాయంత్రం ఉప్పల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కవిత గాయపడ్డారు. ఆమెను కుటుంబ సభ్యులు గాంధీ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు.