జన్వాడ ఫామ్​హౌస్​​పై ప్రజా కోర్టే తేల్చాలె

జన్వాడ ఫామ్​హౌస్​​పై ప్రజా కోర్టే తేల్చాలె

జన్వాడ ఫామ్​హౌస్​​పై ప్రజా కోర్టే తేల్చాలె
ఫామ్​హౌస్​పై డ్రోన్​ కేసులో కోర్టు తీర్పుపై రేవంత్​ ట్వీట్​ 

హైదరాబాద్​, వెలుగు : జన్వాడ ఫాంహౌస్​పై డ్రోన్​ను ఎగరేసి కేటీఆర్​కు ప్రాణహాని తలపెట్టానంటూ పోలీసులు తనను జైలులో పెట్టారని, అసలు ఆ ఫాంహౌస్​ తనది కాదన్న కేటీఆర్​ వాదనకు హైకోర్టు అనుకూలమైన తీర్పునిచ్చిందని పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి అన్నారు. జన్వాడ ఫాంహౌస్​పై రేవంత్​ వేసిన పిటిషన్​ చెల్లదంటూ బుధవారం హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్​ చేయడాన్ని ప్రశ్నిస్తూ గురువారం ట్వీట్​ చేశారు. నిజం ఏంటో ‘ప్రజా కోర్టు’ తేల్చాలని ఆయన అన్నారు. హైకోర్టు తీర్పు కాపీ, పత్రికా కథనాన్ని ఆయన ట్వీట్​కు జోడించారు.