
రేపటి నుంచి ప్రజా పాలన కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకున్నామని చెప్పారు. లోక్ సభ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన లోక్ సభ అభ్యర్థులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించిన కార్యకర్తలకు, నాయకులకు కృతజ్ఞతలు చెప్పారు. గెలిచిన అభ్యర్థులు వాళ్ల పదవీ కాలంలో రాష్ట్రాభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి