దిశ నిందితుల ఎన్‌కౌంటర్ స్థలానికి భారీగా చేరుకుంటున్న ప్రజలు

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ స్థలానికి భారీగా చేరుకుంటున్న ప్రజలు

దిశ నిందితలను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హైదరాబాద్‌లో డాక్టర్‌ను చంపిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. సీన్ రీకనస్ట్రక్షన్ కోసం నిన్న నిందితులను చటాన్ పల్లిలోని ఘటన జరిగిన స్థలానికి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి నిందితులు పారిపోవడానికి ప్రయత్నించడంతో.. చేసేది ఏంలేక పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు నిందితులు అక్కడికక్కడే చనిపోయారు.

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణ శివారులోని చటాన్ పల్లి వద్ద దిశ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన నేపథ్యంలో.. ఈ వార్త దావానంలా వ్యాపించింది. జనాలు తండోపతండాలుగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను, సంఘటన వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించిన మీడియాకు ఆంక్షలు ఎదురయ్యాయి. మీడియాను సంఘటన స్థలానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. సంఘటన స్థలంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, డిసిపి ప్రకాష్ రెడ్డి, ఏసీపీ సురేందర్, సిఐ శ్రీధర్ కుమార్ జిందాబాద్ అంటూ జనాలు నినాదాలు చేస్తున్నారు. ఎన్‌కౌంటర్ జరిగినందుకు జనాల సంతోషానికి అవధులు లేకుండ పోయింది. 44వ నంబర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌జామయింది. జనాన్ని కంట్రోల్ చేయడం పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. సంఘటనా స్థలంలో తెలంగాణ సీఎం కేసీఆర్ జిందాబాద్ అనే నినాదాలు కూడా ఊపందుకున్నాయి.