హైదరాబాద్ సిటీ, వెలుగు: పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో 4వ రాష్ట్ర ప్రజా సంబంధాల సమావేశాన్ని ఏప్రిల్ 19న హైదరాబాద్లో నిర్వహించనున్నారు. ‘తెలంగాణ రైజింగ్ 2047: కమ్యూనికేషన్, ఇన్నోవేషన్, సాధికారత’ అనే ఇతివృత్తంతో జరిగే ఈ సదస్సులో కమ్యూనికేషన్ వ్యూహాలు, మీడియా ఆవిష్కరణలు, బ్రాండ్ బిల్డింగ్ వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు.
ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సంస్థలకు ‘తెలంగాణ ప్రజా సంబంధాల అవార్డులు’ ప్రదానం చేయనున్నారు. 2024 జనవరి 1 నుంచి 2025 డిసెంబర్ 31 మధ్య కాలంలోని పనితీరు ఆధారంగా ఈ అవార్డులకు నామినేషన్లను ఆహ్వానిస్తున్నారు.
ఆసక్తిగల వారు మార్చి 15 లోపు తమ ఎంట్రీలను పంపాలని, వివరాలకు 98493 21641 నంబర్లో సంప్రదించాలని చాప్టర్ చైర్మన్ డాక్టర్ యాదగిరి కంభంపాటి శుక్రవారం తెలిపారు.
