GHMCకి ప్రభుత్వం వేల కోట్ల పన్ను బకాయి

GHMCకి ప్రభుత్వం వేల కోట్ల పన్ను బకాయి

హైదరాబాద్ మహా నగరంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, ఆస్తులు జీహెచ్ఎంసీకి వేల కోట్ల పన్ను బకాయి పడిందని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి అన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలపై సీఎస్ సోమేష్ కుమార్ కు లేఖ రాశారు. ప్రభుత్వరంగ సంస్థలు, ఆస్తులు GHMCకి రూ. 5,258 కోట్ల పన్ను బకాయిలు పడ్డాయన్నారు. ఈ బకాయిలు ఒక సంవత్సరం నుంచి 25 ఏళ్ల కాలపరిమితిలో ఉన్నాయని చెప్పారు. పన్ను బకాయిలు కట్టాలని జీహెచ్ఎంసీ పలుమార్లు నోటీసులు ఇచ్చినా సంబంధిత శాఖల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదన్నారు.

వైద్యశాఖ 23ఏళ్లుగా రూ.1,185 కోట్లు, పోలీస్ శాఖ రూ.420 కోట్ల బకాయిలు పడ్డాయన్నారు. వేల కోట్ల ఆదాయం వస్తున్న ఆబ్కారీ శాఖ పన్ను బకాయిలు చెల్లించకపోవడం ఏంటో అర్థం కావడం లేదన్నారు పద్మనాభరెడ్డి. 21ఏళ్లుగా ఆబ్కారీ శాఖ రూ.895 కోట్ల పన్ను బకాయి ఉందన్నారు. ఇక విద్యాశాఖ 16 ఏళ్లుగా రూ.385 కోట్ల బాకీ ఉందన్నారు. దీన్ని బట్టి చూస్తే సామాన్యుడికి ఒక చట్టం, ప్రభుత్వానికి ఒక చట్టం అన్నట్లుగా సర్కార్ వ్యవహారం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్లే జీహెచ్ఎంసీ ఉత్సవ విగ్రహంలా మారిందన్నారు. అన్ని శాఖలు పన్ను బకాయిలు చెల్లించి జీహెచ్ఎంసీకి నిధుల కొరత లేకుండా చూడాలని సీఎస్ సోమేష్ కుమార్ కు ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి లేఖ రాశారు. 

మరిన్ని వార్తల కోసం..

తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర!

కశ్మీరీ పండిట్లకు భద్రత కల్పించాలె