అందరూ చూస్తుండగానే జలపాతంలో కొట్టుకుపోయాడు

అందరూ చూస్తుండగానే జలపాతంలో కొట్టుకుపోయాడు

ప్రతి ఒక్కరూ వర్షాకాలంలో అందమైన జలపాతాలను చూడాలని కోరుకుంటారు కానీ అలాంటి ప్రదేశాలను సందర్శించేటప్పుడు ముందుగా మీ భద్రత, మీ కుటుంబ భద్రత గురించి జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం. సరదా కోసం ఎదో చేస్తే నిండు ప్రాణాలు చూస్తుండగానే పైకి పోతున్నాయి.  మహారాష్ట్రలోని పుణేలో ఓ కుటుంబం వరదలో కొట్టుకుపోయిన ఘటన మరువకముందే మరో యువకుడు నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. 

32 మందితో పుణే సమీపంలోని తమిని ఘాట్ జలపాతానికి వెళ్లిన స్వప్నిల్ ధావే అనే యువకుడు అందరూ చూస్తుండగానే కొట్టుకుపోయాడు. ఒడ్డు నుంచి జలపాతంలోకి దూకిన క్షణాన్ని వీడియో తీయించుకునేందుకు అతను ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.  అతను ఈత కొట్టడానికి ప్రయత్నించినప్పటికీ, అతను నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఈ ఘటన నిన్న జరగ్గా అతని కోసం అధికారులు వెతుకుతున్నారు. 

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే ఘటనలో ఆదివారం మధ్యాహ్నం నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో ఐదుగురు కుటుంబ సభ్యులు కొట్టుకుపోయారు . లోనావాలాలోని భూషి డ్యామ్ బ్యాక్ వాటర్‌లో మూడు మృతదేహాలు దొరికాయి. ఇతరుల జాడ కోసం అన్వేషణ కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కుటుంబ సమేతంగా నిలిచిన జలపాతం వద్ద ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది.