Video Viral: శభాష్​ గార్డ్​...  మెట్రో స్టేషన్​ లో చిన్నారిని కాపాడిన ఒక్క బటన్​

Video Viral: శభాష్​ గార్డ్​...  మెట్రో స్టేషన్​ లో చిన్నారిని కాపాడిన ఒక్క బటన్​

రెండు వైపులా మెట్రో రైళ్లు దూసుకొస్తున్నాయి. ఈ సమయంలో ఆటాడుకుంటూ ఒక్కసారిగా పట్టాలపై దూకాడు. కుమారుడిని పట్టుకునేందుకు కన్న తల్లి కూడా పట్టాలపైన కిందపడబోయేది. ఈ సమయంలో సెక్యూరిటీ గార్డు చేసిన ఒక్క పనితో ఆ తల్లీబిడ్డలు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదాన్ని గ్రహించి చాకచక్యంతో స్పందించి ప్రాణాలు కాపాడిన ఆ సెక్యూరిటీ గార్డుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రయాణ సమయాల్లో.. బాహ్య ప్రదేశాల్లో చిన్నారులను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో ఈ సంఘటన చెబుతుంది. దీంతోపాటు ప్రమాదం సమయంలో సమయస్ఫూర్తిగా ఎలా వ్యవహరించాలో కూడా ఈ సంఘటన ఉదాహరణగా ఉపయోగపడుతుంది. ప్రమాదం సమయంలో వాటి నివారణకు ఉన్న అవకాశాలను ఎలా వినియోగించుకోవాలో కూడా ఈ ఒక్క ఘటన సూచిస్తుంది. మహారాష్ట్రలోని పుణె  సివిల్‌ కోర్టు అనే మెట్రో స్టేషన్‌లో  ఓ ఘటన జరిగింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది.

ఓ తల్లి... బిడ్డ మెట్రో ట్రాక్​పై నడుస్తుండగా బిడ్డ పడిపోయింది. తన బిడ్డను కాపాడుకునే ప్రయత్నంలో మహిళ కూడా ట్రాక్‌పైకి దూకింది.  అక్కడ ఉన్న వ్యక్తులు  మహిళకు సహాయం చేసేందుకు పరుగులు తీశారు. ఈ సమయంలో  స్టేషన్‌లో ఉన్న సెక్యూరిటీ గార్డు వికాస్ బంగర్ ఎమర్జెన్సీ బటన్‌ను నొక్కాడు. దాని కారణంగా ఇన్‌కమింగ్ రైలు ఆగిపోయింది. మెట్రో స్టేషన్‌కు కేవలం 30 మీటర్ల దూరంలో ఇన్‌కమింగ్ రైలు ఆగింది. ఈ ఘటన నేపథ్యంలో చిన్న పిల్లలతో ప్రయాణించే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పూణే మెట్రో విజ్ఞప్తి చేసింది.