పడుకొని కోర్టుకు​ మాజీ డీజీపీ.. జడ్జి ఫైర్

పడుకొని కోర్టుకు​ మాజీ డీజీపీ.. జడ్జి ఫైర్

చండీగఢ్/చెన్నై: వీడియో కాన్ఫరెన్స్​లో కేసు విచారణ జరుగుతోంది. నిందితుడు పంజాబ్ మాజీ డీజీపీ. విచారణ టైమ్​లో ఆయన దర్జాగా బెడ్ పై పడుకున్నడు. గమనించిన జడ్జి కోపానికి వచ్చారు. కోర్టు అంటే గౌరవం లేదా? అని మండిపడ్డారు. మాజీ పోలీస్ అధికారి అయి ఉండి, ఇలా చేస్తారా? అంటూ ఫైర్ అయ్యారు. పంజాబ్ పోలీస్ మాజీ చీఫ్ సుమేధ్ సింగ్ సైని.. ముగ్గురు వ్యక్తులను కిడ్నాప్ చేసి మర్డర్ చేసినట్లు 1994లో లుథియానాలో కేసు నమోదైంది. ఈ కేసులో మొత్తం నలుగురు పోలీసాఫీసర్లు నిందితులుగా ఉండగా, సైనీనే ఏ1. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ 2004లో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ కేసు విచారణ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ లో జరగ్గా, సైని బెడ్​పై పడుకొని హాజరయ్యాడు. ఎందుకు ఇలా చేశారని నిందితుణ్ని జడ్జి అడిగితే.. తనకు హెల్త్ బాలేదని, జ్వరం వచ్చిందని చెప్పాడు. 

మహిళతో సన్నిహితంగా లాయర్..
మద్రాస్ హైకోర్టులో ఆర్ డీ శంతన కృష్ణన్ లాయర్. సోమవారం ఓ కేసు విచారణకు సంబంధించి ఆయన వీడియో కాన్ఫరెన్స్​లో హాజరయ్యారు. అయితే ఆ టైమ్​లో ఆయన మహిళతో సన్నిహితంగా ఉన్నట్లు వీడియో బయటకు వచ్చింది. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అతణ్ని ప్రాక్టీస్ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది. దీన్ని సుమోటో కేసుగా స్వీకరించి విచారణ చేపట్టింది. నిందితుడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బార్ కౌన్సిల్​ను ఆదేశించింది