RCB vs PBKS: పంజాబ్ సమిష్టి పోరాటం.. బెంగళూరు టార్గెట్ ఎంతంటే..?

RCB vs PBKS: పంజాబ్ సమిష్టి పోరాటం.. బెంగళూరు టార్గెట్ ఎంతంటే..?

ఐపీఎల్ లో ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ సమిష్టిగా రాణించింది. వచ్చిన వారు వచ్చినట్టు తలో చేయి వేయడంతో నిర్ణీత 20 ఓవరల్లో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ బెయిర్ స్టో వికెట్ ను త్వరగానే కోల్పోయింది. 8 పరుగులు చేసిన ఈ ఇంగ్లాండ్ అతగాడిని సిరాజ్ ఔట్ చేశాడు. ఈ దశలో సిమ్రాన్ సింగ్, ధావన్ రెండో వికెట్ కు 55 పరుగుల భాగస్వామిని నెలకొల్పి జట్టును పటిష్ట స్థాయికి చేర్చారు. అయితే ఆ తర్వాత పంజాబ్ 26 పరుగుల వ్యవధిలో సిమ్రాన్ సింగ్(25), ధావన్(45), లివింగ్ స్టోన్(17) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడినట్లుగా అనిపించింది. ఈ దశలో సామ్ కరణ్(23) జితేష్ శర్మ (27) రాణించి జట్టును150 పరుగులకు చేర్చారు.

Also Read: 17 ఏళ్లలో ఒక్కడే: ఐపీఎల్‌లో ధావన్ సరికొత్త చరిత్ర

ఇన్నింగ్స్ చివరి ఓవర్లో అల్జారీ జోసెఫ్ బౌలింగ్ లో 20 పరుగులు రావడంతో పంజాబ్ భారీ స్కోర్ చేయగలిగింది. శశాంక్ సింగ్ 8 బంతుల్లోనే 21 పరుగులు చేసి జట్టుకు డీసెంట్ స్కోర్ అందించాడు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్, మ్యాక్స్ వెల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. యాష్ దయాళ్ అల్జారీ జోసెఫ్ కు చెరో వికెట్ దక్కింది.