ప్రముఖ పంజాబీ సింగర్ దల్జిత్ దోసాంజ్పై ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) బెదిరింపులకు పాల్పడింది. నవంవర్ 1న ఆస్ట్రేలియాలో దోసాంజ్ షోను అడ్డుకుంటామని SFJ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్హెచ్చరించారు.
ఇటీవల కౌన్ బనేగా కరోడ్ పతి ఎపిసోడ్ లో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన పాదాలకు నమస్కారం చేసినందుకు పంజాబీ సింగర్ దల్జిత్ దోసాంజ్ పై ఖలిస్తాని ఉగ్రవాద సంస్థగా ఉన్న సిక్స్ ఫర్ జస్టిస్ గుర్రుగా ఉంది.
1984 అక్టోబర్ 31న ఖూన్ కా బద్లా ఖూన్ అనే నినాదంతో బహిరంగంగా మారణహోమ మూకలను ప్రేరేపించారని ఆరోపించిన మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పాదాలను దోసాంజ్ తాకినందుకు ఖలిస్తానీ ఉగ్రవాదులు ఈ బెదిరింపులకు పాల్పడ్డారు.
