పుష్ప మూవీ మచ్చ అరెస్ట్..

పుష్ప మూవీ మచ్చ అరెస్ట్..

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ 'పుష్ప' ఫేమ్ కేశవ అలియాస్ జగదీష్ ని  పంజాగుట్ట  పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాగుట్టలో నివాసం ఉంటున్న ఓ యువతి ఐదు రోజుల క్రితం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  తన కూతురు ఆత్మహత్యకు నటుడు జగదీష్ కారణమని ఆరోపిస్తూ మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కూతురిని జగదీష్ మోసం చేశాడని  ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పంజాగుట్ట పోలీసులు.. డిసెంబర్ 6వ తేదీ బుధవారం  జగదీష్ ని అరెస్టు చేశారు.

అనంతరం జగదీష్ ను కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు.  మృతి చెందిన యువతి గతంలో షార్ట్ ఫిల్మ్స్ తీసినట్లు సమాచారం. ఈ క్రమంలో యువతితో జగదీష్ కు పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే, యువతి ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న సమయంలో.. ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెడుతానని జగదీష్ బెదిరింపులకు పాల్పడ్డడాడని.. దీంతో మనస్తాపంతో యువతి నవంబర్ 29వ తేదీ బుధవారం ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.