Balakrishna: బాలకృష్ణ హెల్త్ అప్‌డేట్.. AIG వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల

Balakrishna: బాలకృష్ణ హెల్త్ అప్‌డేట్.. AIG వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల

నటసింహం నందమూరి బాలకృష్ణ షూటింగ్‌లో గాయపడిన విషయం తెలిసిందే. మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న AIG ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులు బాలకృష్ణకు సమగ్ర పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో బుధవారం (జూలై 22, 2026న) ఆయన ఆరోగ్య పరిస్థితిపై AIG ఆసుపత్రి వర్గాలు అధికారిక హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశాయి. ఇందులో బాలకృష్ణ గాయం తీవ్రత, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి, చేపడుతున్న చికిత్సకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు.

AIG హెల్త్ బులెటిన్‌లో ఏముంది?

వైద్య పరీక్షల్లో బాలకృష్ణ ఎడమ మోకాలి చుట్టూ ఉన్న కణజాలాల్లో రక్తం గడ్డకట్టడంతో పాటు వాపు ఉన్నట్లు గుర్తించారు. మోకాలి భాగంలో కండరాల గాయం (Muscle Tear) ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ గాయం కారణంగా చిన్నపాటి సర్జరీ అవసరం కావచ్చని వైద్య వర్గాలు వెల్లడించాయి. బాలకృష్ణ గత వైద్య చరిత్రను పరిగణనలోకి తీసుకుని, ఆర్థోపెడిక్ సర్జన్లతో పాటు వివిధ విభాగాల నిపుణులతో కూడిన ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. 

బాలయ్య ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది?

ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని AIG ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నారని, మరిన్ని పరీక్షలు పూర్తైన తర్వాత తుది చికిత్స ప్రణాళికను ఖరారు చేస్తామని డాక్టర్లు తెలిపారు.

బాలకృష్ణకు గాయం అయ్యిందనే వార్త తెలియడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని సినీ, రాజకీయ ప్రముఖులు, ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. వైద్యులు తమ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది మరో హెల్త్ బులెటిన్ ద్వారా వెల్లడించనున్నారు.

►ALSO READ | Jana Nayagan: ‘జన నాయగన్’లో బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్.. ముగ్గురు స్టార్ డైరెక్టర్లు క్యామియోలు.. 

అసలేం జరిగింది?

హీరో బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఇటీవల కాకినాడలో కొత్త షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను స్టార్ట్ చేశారు. అక్కడ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్న సమయంలో బాలకృష్ణకు స్వల్ప గాయం అయింది. వైద్యులు పరీక్షించిన అనంతరం ఆయనకు  కండరాల గాయం  అయ్యిందని, మైనర్  సర్జరీ చేయాలని సూచించినట్టుగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెలియజేశాడు. అయితే అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నాడు. ఈ గాయం తీవ్రంగా ఏమీ కాదని, చికిత్స అనంతరం బాలకృష్ణ  పూర్తిగా కోలుకుని త్వరలోనే మళ్లీ సినిమా షూటింగ్‌‌‌‌‌‌‌‌లో పాల్గొంటారని చెప్పాడు.

సినిమాపై ఆయనకున్న క్రమశిక్షణ, కష్టపడే తత్వం టీమ్‌‌‌‌‌‌‌‌లోని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తోందని,  గాయం అయినప్పటికీ సినిమా పట్ల బాలయ్య  చూపిస్తున్న నిబద్ధత అందరికీ ఆదర్శమని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బాలకృష్ణ హీరోగా  నటిస్తున్న 111వ చిత్రం కాగా, కాజల్ అగర్వాల్, మంచు మనోజ్ కీలక పాత్రలు  పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.