Jana Nayagan: ‘జన నాయగన్’లో బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్.. ముగ్గురు స్టార్ డైరెక్టర్లు క్యామియోలు.. పోస్ట్ క్లైమాక్స్‌లో పిచ్చెక్కించే సీన్!

Jana Nayagan: ‘జన నాయగన్’లో బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్.. ముగ్గురు స్టార్ డైరెక్టర్లు క్యామియోలు.. పోస్ట్ క్లైమాక్స్‌లో పిచ్చెక్కించే సీన్!

‘జన నాయగన్’ (Jana Nayagan) విడుదలకు ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉంది. రేపు తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 7:30కే ఫస్ట్ షోస్ మొదలవ్వనున్నాయి. అందుకు థియేటర్లు సర్వం సిద్ధమయ్యాయి. ముఖ్యంగా పొలిటికల్ అండ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఆల్-టైమ్ రికార్డులను తిరగరాస్తుంది. ఇదే సమయంలో మేకర్స్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ మరింత ఆసక్తి పెంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ H. వినోద్ లీక్ చేసిన ఒక బిగ్ సర్‌ప్రైజ్ సినీ సోషల్ మీడియాను ఊపేస్తోంది.

ముగ్గురు స్టార్ డైరెక్టర్లతో క్యామియో సీన్..

సినిమా పోస్ట్-క్లైమాక్స్ లో తమిళ్ ఇండస్ట్రీలోని ముగ్గురు సెన్సేషనల్ డైరెక్టర్లు.. లోకేష్ కనగరాజ్, అట్లీ, నెల్సన్ దిలీప్‌కుమార్ క్యామియో పాత్రల్లో కనిపించనున్నారనే వినోద్ చెప్పడంతో.. ఈ వార్త సినీ ఫ్యాన్స్ ను తీవ్రంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా విజయ్ తన సినీ కెరీర్‌లోని చివరి దశలో.. ఈ ముగ్గురు దర్శకులతో చేసిన సినిమాలు కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించాయి. వాటిలో ముందుగా.. 

అట్లీ (Atlee):

తేరి (Theri), మెర్సల్ (Mersal), బిగిల్ (Bigil) వంటి మూడు సినిమాలతో విజయ్ కెరీర్ కి బిగ్ బూస్ట్ ఇచ్చాడు. విజయ్ లోని మాస్ ను తెరపై బ్లాస్ట్ అయ్యేలా చేసి రికార్డులు కొల్లగొట్టాడు అట్లీ. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ‘బిగిల్’ చిత్రం ఏకంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఆ సమయంలో విజయ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj):

మాస్టర్ (Master), లియో (Leo) వంటి స్పై థ్రిల్లింగ్ సినిమాలు చేసి విజయ్ ని మరింత ఎత్తులో కూర్చోబెట్టాడు. ఇందులో 'మాస్టర్' సినిమా రూ.250 కోట్ల వసూళ్లను సాధించగా, 'లియో' ఏకంగా రూ.600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి తమిళ సినిమా చరిత్రలోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా నిలిచింది.

నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar):

నెల్సన్-విజయ్ కాంబోలో వచ్చిన బీస్ట్ (Beast) సినీ ఆడియన్స్ కు వీపరీతంగా నచ్చింది. విజయ్ మాస్ ఇమేజ్ వల్ల ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా గ్రాస్ సాధించి దళపతి బాక్సాఫీస్ స్టామినాను నిరూపించింది.

విజయ్ ఓన్ డైరెక్షన్: థియేటర్లలో రాం పేజ్ కన్ఫామ్..

అయితే, ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ముగ్గురు స్టార్ డైరెక్టర్లు (లోకేష్, అట్లీ, నెల్సన్) స్క్రీన్ పైన విజయ్ పాత్రను ప్రశ్నించే దిశగా ఎపిసోడ్ ఉండనుందని డైరెక్టర్ వెల్లడించాడు. ఈ హై-వోల్టేజ్ ఎమోషనల్ సీన్‌ను డైరెక్టర్ వినోద్ కాకుండా స్వయంగా విజయ్ డైరెక్ట్ చేశారని చెప్పడంతో అంచనాలు మొదలయ్యాయి. 

►ALSO READ | Jana Nayagan First Review: ‘జననాయగన్’ ఫస్ట్ టాక్ ఎలా ఉందంటే?

తనను మాస్ ఐకాన్‌గా మార్చిన దర్శకులను తన చివరి సినిమాలో భాగం చేస్తూ, వారిని విజయే స్వయంగా డైరెక్ట్ చేయడం వెండితెరపై అతిపెద్ద మ్యాజిక్‌లా ఉండబోతోందని వినోద్ తెలిపారు. పోస్ట్ క్లైమాక్స్‌లో వచ్చే ఈ ఎమోషనల్ అండ్ మెమొరబుల్ ఘట్టం థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు, కేకలు వేయించడం కన్ఫామ్ అని డైరెక్టర్ వినోద్ వెల్లడించాడు. 

రూ.400 కోట్ల బడ్జెట్.. బాక్సాఫీస్ వద్ద విజయ్ ప్రభంజనం!

కేవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు వస్తున్న చివరి చిత్రం కావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే అల్టిమేట్ లెవల్‌లో జరుగుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 8,000 స్క్రీన్లలో విడుదలవుతున్న ఈ చిత్రం తొలిరోజే ఎవరూ ఊహించని రీతిలో భారీ ఓపెనింగ్స్ సాధించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాయడానికి సిద్ధమైంది. ఈ ఊపు చూస్తుంటే మొదటి రోజే ఆల్-టైమ్ రికార్డులను తుడిచిపెట్టేస్తూ, బాక్సాఫీస్ వద్ద విజయ్ సరికొత్త ప్రభంజనం సృష్టించే దిశగా దూసుకుపోతున్నారని ట్రేడ్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు!