గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు: నిరంజన్ రెడ్డి

గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు: నిరంజన్ రెడ్డి

కరోనా కు అడ్డుకట్ట వేస్తూనే.. వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి.  యాసంగి లో 39 లక్షల ఎకరాల సాగయ్యిందన్నారు. పండిన ప్రతి గింజను  కొనుగోలు చేస్తామని తెలిపారు. పట్టణ ప్రాంత కేంద్రాలకు  ధాన్యాన్ని తీసుకురావద్దని రైతులకు సూచించారు .అంతేకాదు  ఏ గ్రామంలో పండించిన పంటను … ఆ గ్రామంలో నే రైతు అమ్ముకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని తెలిపారు. . రైతులకు ఇబ్బంది లేకుండా .. గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కొనుగోలు సెంటర్ ల విషయంలో ఆంక్షలు లేవని..అవసారినికి తగ్గట్టు కొనుగోలు సెంటర్ లు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. కొనుగోలు సెంటర్ లలో తేమ మిషన్ లను కూడా ఏర్పాటు చేశామన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.

60వేల టారఫలిన్ కొనుగోలు చేయడానికి ఉత్తర్వులు జారీ చేసామని తెలిపారు నిరంజన్ రెడ్డి . జనాలు ఎక్కువ మంది గుమి కూడా కుండా కొనుగోలు సెంటర్ల దగ్గర టోకెన్ సిస్టంను తీసుకొచ్చామన్నారు. ధాన్యం తీసుకు వచ్చేటప్పుడు బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకు వస్తే…ధాన్యం అమ్మిన వెంటనే ఒకటి రెండు రోజుల్లో అకౌంట్ లో డబ్బులు పడతాయన్నారు. రాష్ట్రంలో మక్కలు 5 లక్షల91 వేల ఎకరాల  పంట సాగు అయ్యిందని…పండిన పంటను మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామన్నారు. రేపటి(మంగళవారం) నుండి మక్కలు కూడా కొనుగోలు చేస్తామని తెలిపారు.

దేశ వ్యాప్తంగా పర్టీలైజర్ కు అనుమతి ఉందన్నారు నిరంజన్ రెడ్డి.  మార్కెటింగ్,వ్యవసాయంతో పాటు వివిధ శాఖలను కలుపుకుని ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసామన్నారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూరగాయలు  అమ్మే దగ్గర ఎంక్వైరీ చేస్తారని.. ఒక వేళ ఎక్కువ ధరకు కూరగాయలు అమ్మితే డైరెక్ట్ జైలు కు పంపిస్తామని హెచ్చరించారు.

అంతే కాదు కూరగాయలు కొనుగోలు కోసం కుటుంబం నుండి ఒక్కరే రావాలని సూచించారు. ధరలు ఎక్కువ చెప్పారని వారి మీద దాడులు చేయవద్దని ప్రజలకు సూచించారు. అత్యవసర వస్తువులు లేకపోతే ప్రభుత్వం సమకూరుస్తుంద తెలిపారు. నిత్యావసర వస్తువులు ధరలు పెంచినా..కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి నిరంజన్ రెడ్డి.