పుష్ప వర్సెస్ కాంతారా.. బిగ్ డిబేట్ ఇన్ సోషల్ మీడియా

పుష్ప వర్సెస్ కాంతారా.. బిగ్ డిబేట్ ఇన్ సోషల్ మీడియా

పుష్ప 2 ఫస్ట్ లుక్స్ ఇండియా వైడ్ ట్రెండ్ అయ్యింది. అమ్మోరునే అలంకరిస్తూ అన్నట్లు బన్నీ మేకోవర్ కు ఫ్యాన్స్ మొత్తం షాక్ అయ్యింది. ఊహించని విధంగా ఉన్న ఈ లుక్ పై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది సోషల్ మీడియాలో. అల్లు అర్జున్ మెడలో నిమ్మకాయలు, ఒంటికి రంగులు, కళ్లకు కాటుక.. అమ్మవారి గెటప్‌ చూస్తుంటే.. కాంతారా గుర్తుకొస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. 

అల్లు అర్జున్ కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారని ఫ్యాన్స్ అంటుంటే.. రైవల్స్ మాత్రం కాంతారాను కాపీ కొట్టారని.. ఇంచుమించు అలాగే ఉందని.. కాకపోతే అది దైవత్వంతో ఉంటే.. బన్నీ మాత్రం మాస్ గా కనిపించాడని అంటున్నారు.  కాంతారాలో భూత కోల ఆచారాన్ని చూపించారని..  అల్లు అర్జున్ పుష్ప 2 లుక్ అలాగే ఉందనే వాదన జరుగుతుంది. కాంతారాతో పోలిక పెట్టి మరీ దుమారం రేపుతున్నారు నెటిజన్లు. 

అసలు విషయాన్ని వస్తే మాత్రం.. బన్నీ లుక్స్ కొత్త కాదు.. తిరుపతి గంగమ్మ జాతరలో పురుషులు మహిళా వేషదారణలో కనిపించటం దశాబ్దాలుగా వస్తుంది. ప్రతిఏటా గంగమ్మ జాతరలో ఇది కామన్. ఆ వేషధారణను మోడ్రన్ లుక్ చూపించారనేది ఫ్యాన్స్ మాట. చిత్తూరు సంప్రదాయాన్ని కొత్త తరహా చూపించారనేది రాయలసీమ ఫ్యాన్స్ అంటున్నారు.  గంగమ్మ జాతర గురించి పుష్ప మూవీలో దాక్కో దాక్కో మేక పాటలో కూడా ఉంటుంది. అమ్మవారి వేషంలో చేతిలో గన్ పట్టుకొని కోపంగా అల్లు అర్జున్ నడుస్తున్న ఉన్న స్టిల్‌.. సినిమా మీద అంచనాలు పెంచేసింది.