- పట్టు విడవక లక్ష్యం కోసం ముందుకు సాగాలి
- ఇండియా ఆర్చరీ అసోసియేషన్ డెవలప్ మెంట్ కమిటీ మెంబర్ పుట్ట శంకరయ్య
నెల్లికుదురు, వెలుగు: ఆర్చరీ క్రీడాకారులు పట్టు విడవక లక్ష్యం కోసం ముందుకు సాగాలని ఇండియా ఆర్చరీ అసోసియేషన్ డెవలప్ మెంట్ కమిటీ మెంబర్ పుట్ట శంకరయ్య సూచించారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ఫిజికల్ డైరెక్టర్ ఐలయ్య ఆధ్వర్యంలో ఎస్జీఎఫ్ స్టేట్ లెవల్ ఆర్చరీ పోటీలు నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి ఆర్చరీ క్రీడాకారులు పాల్గొనగా కార్యక్రమాన్ని ప్రారంభించిన శంకరయ్య మాట్లాడారు.
ఒలంపిక్స్ ఆర్చరీ క్రీడాకారులు గోల్ సాధించాలని అందుకు తగిన సమయం కేటాయించి కష్టపడాలని సూచించారు. ఆర్చర్ లో ప్రతిభ సాధిస్తే క్రీడాకారులకు బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఆర్చరీ గోల్డ్ మెడలిస్ట్ నానావత్ రవీందర్, కాంపిటేషన్ అబ్జర్వర్ జరుపుల పీరియా నాయక్, ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్ట్ తేజావత్ రవి నాయక్ పాల్గొన్నారు.
