త్వరలోనే అకాడమీ ప్రారంభిస్తా..

V6 Velugu Posted on Aug 13, 2021

తిరుమల: టోక్యో ఒలంపిక్ కాంస్య పతక విజేత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందడం చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు. స్వామి వారి ఆశీస్సుల కోసం తాను ప్రతి ఏడాది  తిరుమలకు వస్తానని.. కానీ ఈసారి మాత్రం ఒలంపిక్స్ అయ్యాక తిరుమలకు వచ్చానని ఆమె తెలిపారు. స్వామి వారి ఆశీస్సులు అందరి మీదా ఎప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు ఆమె చెప్పారు. విశాఖపట్నంలో త్వరలోనే అకాడమీ ప్రారంభిస్తామని.. యువతను ప్రోత్వహించడమే తన లక్ష్యమని సింధు అన్నారు. చాలా మంది యువత సరైన ప్రోత్సాహం లేక వెనుకబడుతున్నారని ఆమె అన్నారు. ప్రజలందరూ కోవిడ్ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రాబోయే టోర్నమెంట్స్ లో కూడా స్వామి వారి ఆశీస్సులు ఉండాలని.. మంచి మెడల్ తో మీ ముందుకు రావలనుకుంటున్నట్లు సింధు అన్నారు.

Tagged tirumala, Tirupati, sports, Badminton, PV Sindhu, badminton academy, Vishakapatnam

Latest Videos

Subscribe Now

More News