కూకట్ పల్లిలో.. పీవీఆర్ నుంచి 9 స్క్రీన్ల మల్టీప్లెక్స్‌‌‌‌‌‌‌‌ 

కూకట్ పల్లిలో.. పీవీఆర్ నుంచి 9 స్క్రీన్ల మల్టీప్లెక్స్‌‌‌‌‌‌‌‌ 

హైదరాబాద్​, వెలుగు: పీవీఆర్ ఐనాక్స్ హైదరాబాద్ కూకట్‌‌‌‌‌‌‌‌పల్లిలోని లేక్‌‌‌‌‌‌‌‌షోర్ మాల్‌‌‌‌‌‌‌‌లో తొమ్మిది స్క్రీన్ల మల్టీప్లెక్స్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది. నగరంలో ఇది సంస్థకు 18వ సినిమా థియేటర్. దీనితో నగరంలో మొత్తం స్క్రీన్ల సంఖ్య 111కి చేరింది. ఇందులో భారీ స్క్రీన్ పీఎక్స్ఎల్, పిల్లల కోసం ప్లేహౌస్ వంటి ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి.

అత్యాధునిక 4కే లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. యువత, కుటుంబ సభ్యులను ఆకర్షించేలా దీనిని రూపొందించారు. ఈ సందర్భంగా సంస్థ ఎండీ అజయ్ బిజిలీ మాట్లాడుతూ హైదరాబాద్ తమకు కీలక మార్కెట్ అని, ముఖ్యంగా యువత, జెన్ జీ ప్రేక్షకులు ఇక్కడ ఎక్కువగా సినిమాలు చూస్తున్నారని పేర్కొన్నారు.