
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తున్నాయని, పెట్రోల్‌పై ఉన్న ‘‘ఎలక్షన్ ఆఫర్” అయిపోతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఈ ఆఫర్ ముగియక ముందే ప్రజలు పెట్రోల్ ట్యాంకులు నింపుకోవాలని ట్విట్టర్‌లో సూచించారు. శనివారంతో అసెంబ్లీ ఎన్నికల చివరి విడత ప్రచారం ముగుస్తుండటంతో రాహుల్ ఈ కామెంట్లు చేశారు.