రాష్ట్రంలో భూ కబ్జాలపై సీబీఐ విచారణ జరిపించాలి :  ఆర్ కృష్ణయ్య డిమాండ్

రాష్ట్రంలో భూ కబ్జాలపై సీబీఐ విచారణ జరిపించాలి :  ఆర్ కృష్ణయ్య డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భూకబ్జాలు, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయాయని ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. గురువారం విద్యానగర్ బీసీ భవన్​లో ఆయన మాట్లాడుతూ.. భూకబ్జాలను అరికట్టడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శించారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల అక్రమ ఆస్తులు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రధానిని కలిసి ఫిర్యాదు చేస్తామని, ప్రభుత్వం స్పందించకుంటే ప్రజలతో కలిసి తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో అనంతయ్య, పగిళ్ల సతీశ్, రాజేందర్, మేకల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.