బిల్లులు విడుదల చేయకుంటే : ఆర్.కృష్ణయ్య

బిల్లులు విడుదల చేయకుంటే : ఆర్.కృష్ణయ్య
  • సీఎం ఇంటిని ముట్టడిస్తాం: ఆర్.కృష్ణయ్య

బషీర్​బాగ్/కోఠి, వెలుగు: గత 8 నెలలుగా పెండింగ్​లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల డైట్, కాస్మోటిక్, రెంట్ బిల్లులతో పాటు వర్కర్ల జీతాలను వెంటనే విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్​లో ఆయన మాట్లాడుతూ.. రెండు నెలల కింద సీఎంను కలవగా గ్రీన్ చానల్​లో పెడతామని హామీ ఇచ్చి విస్మరించారని ఆరోపించారు.

బిల్లులు రాక సరుకుల సప్లై బంద్ కావడంతో వార్డెన్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా నిధులు విడుదల చేయని పక్షంలో వేలాది మంది విద్యార్థులతో కలిసి సీఎం నివాసాన్ని ముట్టడిస్తామన్నారు. 

ఫార్మసిస్ట్ అభ్యర్థులకు మద్దతు

గురువారం కోఠిలోని డీఎంఈ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టిన ఫార్మసిస్ట్ అభ్యర్థులకు ఆర్. కృష్ణయ్య మద్దతు తెలిపారు. 732 ఫార్మసిస్ట్ పోస్టులకు పరీక్ష జరిగి నెలలు గడుస్తున్నా సెలక్షన్ లిస్ట్ విడుదల చేయకుండా కోర్టు కేసుల నెపంతో జాప్యం చేస్తున్నారని విమర్శించారు. అధికారులకు 15 రోజుల సమయం ఇస్తున్నామని, అప్పటిలోగా జాబితా విడుదల చేయకపోతే వేలాది మందితో డీఎంఈ కార్యాలయాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అనంతరం రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బోర్డు సభ్యుడు గోపికాంత్ రెడ్డిని కలిసి సమస్యను వివరించారు.