కైకాలకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు: ఆర్ నారాయణమూర్తి

కైకాలకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు: ఆర్ నారాయణమూర్తి

కైకాల సత్యనారాయణ మరణం పట్ల ఆర్ నారాయణమూర్తి సంతాపం తెలిపారు. ప్రపంచం గర్వించదగ్గ గొప్ప నటుడు కైకాల అని.. ఆయన లేని లోటుని ఎవరు తీర్చలేరని చెప్పారు. నిర్మాతల మంచి కోరే గొప్ప వ్యక్తి ఇప్పుడు లేకపోవడం ఎంతో బాధకరమైన విషయమన్నారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా చూడడని గుర్తు చేశారు. అయితే.. కైకాలకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని చెప్పారు. 4, 5 సినిమాలలో నటించేవారికి అవార్డ్స్ ఇస్తున్నారని భవిష్యత్తులో అయినా ఇది మారాలని ఆర్ నారాయణమూర్తి అన్నారు. 

మరోవైపు సినీ, రాజకీయ ప్రముఖులు కైకాల మృతదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇక కైకాల అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రేపు ఉదయం 10.30 గంటలకు మహాప్రస్తానంలో కైకాల భౌతికాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.