గణేశ్ నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు : కమిషనర్ సుధీర్ బాబు

గణేశ్ నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు :  కమిషనర్ సుధీర్ బాబు

ఘట్​కేసర్, వెలుగు: గణేశ్ నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. ఎదులాబాద్, కాప్రా చెరువులను ఆదివారం ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి నవరాత్రి ఉత్సవాలను సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

 నిమజ్జనం జరిగే చెరువులు, కుంటల వద్ద క్రేన్లు, బారికేడ్లు, గజ ఈతగాళ్లు, లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కమిషనర్ వెంట డీసీపీ పద్మజ, ఘట్​కేసర్ సీఐ సైదులు, పోచారం సీఐ రాజు వర్మ, ఇతర అధికారులు ఉన్నారు.