ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో సింథటిక్ డ్రగ్స్ తయారీ

ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో సింథటిక్ డ్రగ్స్ తయారీ

హైదరాబాద్ శివార్లలో డ్రగ్స్ తయారుచేస్తోన్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో సింథటిక్ డ్రగ్స్ తయాచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గత కొన్నాళ్ల నుంచి డ్రగ్స్ తయారు చేస్తూ ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ కేసులో ఇద్దరినీ అరెస్ట్ చేశామన్న సీపీ..అరెస్ట్  అయినవారిలో పులిచర్ల శ్రీనివాస్ రెడ్డి పాత నేరస్తుడని చెప్పారు. 2010లో ఎన్‌సీబి చెన్నై, 2014లో ఎన్‌సీబి హైదరాబాద్, 2015లో కీసర పీఎస్, 2018లో ఉప్పల్ పీఎస్ లో నమోదైన కేసుల్లో అతడు నిందితుడుగా ఉన్నట్లు వెల్లడించారు.

మరో నిందితుడు లెనిన్ బాబు ఆర్గానిక్ కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాడని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. 2014 లో అక్షజ్ మాలిక్యూలర్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ ను స్థాపించాడన్నారు. 2019లో శ్రీనివాస్ రెడ్డి పరిచయం అయిన తర్వాత..ఇద్దరు కలిసి మెథాఫెటామైన్ డ్రగ్ ను తయారు చేస్తున్నట్లు వెల్లడించారు.