బైకులు దొంగిలించి OLX లో అమ్ముతుండు

బైకులు దొంగిలించి OLX లో అమ్ముతుండు

ఓఎల్ఎక్స్ లో  సెకండ్ హ్యాండ్ బైకులు కొనాలనుకునే వాళ్లు జాగ్రత్త..ఎందుకైనా మంచిది ఒక్కసారి డాక్యుమెంట్స్ సరిగా ఉన్నాయో లేదో  చెక్ చేసుకుని కొనండి. ఎందుకంటే.. ఈ మధ్యన దొంగిలించిన బైకులకు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి సెకండ్ హ్యాండ్ లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. హైదరాబాద్ లో  లేటెస్ట్ గా దొంగిలించిన బైకులను   ఓఎల్ఎక్స్ లో  అమ్ముతున్న ఘరానా దొంగను  రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. 

నిందితుడి దగ్గరి నుంచి 23 ద్విచక్రవవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై ఇప్పటి వరకు పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ పరిధిల్లో 19 కేసులు నమోదయ్యాయి. పాలిటెక్నిక్ డ్రాప్ ఔట్ స్టూడెంట్  సాయి కుమార్  బైకుల దొంగతనాలకు పాల్పడుతున్నాడు. దొంగిలించిన బైకులకు సాయికుమార్ తన రూంటో  ఫేక్ డాక్యుమెంట్లను తయారు చేస్తున్నాడు.  తర్వాత బైకులను ఓఎల్ఎక్స్ లో అమ్ముతున్నాడని రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. 

అలాగే వ్యవసాయ పొలాల దగ్గర ట్రాక్టర్ ట్రాలీలు చోరీ చేస్తున్న మరో ముఠాను పట్టుకున్నామని సీపీ సుధీర్ బాబు  తెలిపారు.  ముఠా నుంచి 13 ట్రాక్టర్ ట్రాలీలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.  ఈ ముఠాపై పలు పోలీస్ స్టేషన్లలో 12 కేసులు నమోదయ్యాయని తెలిపారు.