ఇంతకీ మీరు ఆటగాళ్లా, రౌడీలా?.. ఫుట్బాల్ గ్రౌండ్లోనే పొట్టు పొట్టు కొట్టుకున్న ప్లేయర్స్!

ఇంతకీ మీరు ఆటగాళ్లా, రౌడీలా?.. ఫుట్బాల్ గ్రౌండ్లోనే పొట్టు పొట్టు కొట్టుకున్న ప్లేయర్స్!

Rafael Leao: 2026 ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) కోసం ఫల్ జోష్ తో ఒకవైపు జోరుగా సిద్ధమవుతున్న పోర్చగల్ జట్టుకి ఊహించని బిగ్ షాక్ తగిలింది. చిలీతో జరిగిన ఒక వార్మప్ మ్యాచులో ఇరు టీమ్స్ ప్లేయర్స్ ఒకరినొకరు నెట్టుకుంటూ స్టేడియంలోనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఈ గొడవతో పోర్చగల్ స్టార్ వింగర్ రాఫెల్ లియావో (Rafael Leao)కి రెడ్ కార్డు రావడంతో గ్రౌండ్ బయటకి వెళ్లిపోయాడు. 


గ్రౌండ్ నుంచి రాఫెల్ లియావో ఔట్: 
మ్యాచ్ ప్రారంభమైన ఫస్ట్ హాఫ్ ఇంజూరీ టైమ్ నడుస్తున్న సమయంలో పోర్చుగల్ ఆటగాడు జోనో కాన్సెలో, చిలీ డిఫెండర్ ఫెలిపే ఫౌండెజ్ మధ్య జరిగిన చిన్న లొల్లి పెద్ద గొడవకు దారి తీసింది. స్టార్టింగ్ లో ఇద్దిరి మధ్య జరిగిన వాగ్వాదం.. అందరూ చూస్తుండగానే ఇరు జట్ల ప్లేయర్స్ ఎంట్రీ ఇవ్వడంతో తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ గందరగోళంలో చిలీ ఆటగాడు ఇవాన్ రోమన్, రాఫెల్ లియావో ఇద్దరు గట్టిగానే కొట్టుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన రెఫరీ ఇద్దరు ప్లేయర్స్ కి డైరెక్టుగా రెడ్ కార్డ్ ఇచ్చి మైదానం బయటకి పంపించాడు. 
 
పోర్చుగల్ జట్టులో ఫుల్ టెన్షన్: 
రెఫరీ ఇచ్చిన ఈ రెడ్ కార్డు వల్ల ప్రస్తుతం పోర్చుగల్ క్యాంపులో ఫుల్ టెన్షన్ నెలకొంది. ఏసీ మిలన్ ఫార్వర్డ్ ప్లేయర్ అయినా రాఫెల్ లియావోపై ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా అనే భయం ఆ జట్టుకి పట్టుకుంది. ఒకవైళ అతడిపై అఫీఫియల్ బ్యాన్ పడితే.. ఫిఫా వరల్డ్ కప్ లో పోర్చుగల్ ఆడబోయే ఫస్ట్ కొన్ని మ్యాచులకు రాఫెల్ దూరం అయ్యే ఛాన్స్ ఉంది. 

10 మందితోనే పోర్చుగల్ విక్టరీ: 
రాఫెల్ లియావోకి రెడ్ కార్డు ఇవ్వడంతో గ్రౌండ్ బయటకి వెళ్లినప్పటికీ, పోర్చుగల్ జట్టు 10 మంది ప్లేయర్స్ తోనే ఆడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సెకండ్ హాఫ్ లో అదిరిపోయే రేంజ్ లో పుంజుకున్న పోర్చుగల్ ఆటగాళ్లు.. సబ్ స్టిట్యూట్ గా వచ్చిన గొంకాలో గెడెన్ ఫస్ట్ గోల్ కొట్టి డెడ్ లాక్ ను బ్రేక్ చేయడంతో.. ఆ వెంటనే స్టార్ ప్లేయర్ బ్రూనో ఫెర్నాండెజ్ సెకండ్ గోల్ కొట్టి పోర్చుగల్ ఆధిక్యంలోకి వచ్చేలా చేశాడు. చివర్లో చిలీ ఆటగాడు లూకాస్ సెపెడా ఒక గోల్ కొట్టి రికవరీ చేసేందుకు ట్రై చేసినా.. లాస్ట్ కి పోర్చుగల్ 2–1తేడాతో విజయం సాధించింది.