కామెంటేటర్గా రహానె

కామెంటేటర్గా రహానె

ముంబై: టీమిండియా మాజీ బ్యాటర్‌‌ అజింక్య రహానె.. కామెంట్రీ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ఇండియా, శ్రీలంక మధ్య జరగనున్న రెండు మ్యాచ్‌‌ల టెస్ట్‌‌ సిరీస్‌‌తో రహానె కామెంటేటర్​గా అరంగేట్రం చేయనున్నాడు. ఈ సిరీస్‌‌ కోసం రహానె.. సోనీ స్పోర్ట్స్‌‌ నెట్‌‌వర్క్‌‌ ప్యానెల్‌‌తో కలిసి పని చేయనున్నాడు.

 దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌‌కు ఇటీవల వీడ్కోలు పలికిన రహానె.. ఇక నుంచి మైక్రోఫోన్‌‌ ముందు కొత్త బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. తన ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌ ఎక్స్‌‌పీరియెన్స్‌‌ను బ్రాడ్‌‌కాస్ట్‌‌ ద్వారా అభిమానులతో పంచుకోనున్నాడు. 

37 ఏళ్ల రహానె ఇండియా తరఫున 85 టెస్టులు ఆడాడు. 38.46 సగటుతో 5,077 పరుగులు సాధించాడు. ఇందులో 12 సెంచరీలు, 26 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2020–-21లో ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయాన్ని అందించిన భారత జట్టుకు రహానె నాయకత్వం వహించాడు. అనేక విదేశీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.