వారసుల వంతొచ్చింది: కర్ణాటక జట్టులోకి రాహుల్ ద్రవిడ్ తనయుడు

వారసుల వంతొచ్చింది: కర్ణాటక జట్టులోకి రాహుల్ ద్రవిడ్ తనయుడు

ది వాల్, మిస్టర్‌ డిపెండబుల్, టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అడుగుజాడల్లోనే అతని తనయులు నడుస్తున్నారు. చిన్న కుమారుడు అన్వయ్‌ ద్రవిడ్‌ అండర్-14 కర్ణాటక క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా రాణిస్తుండగా.. పెద్ద కుమారుడు సమిత్ ద్రవిడ్  కర్ణాటక అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు.

వినూ మన్కడ్ దేశవాళీ టోర్నీ కోసం కర్ణాటక రాష్ట్ర అసోసియేషన్ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టులో రాహుల్ ద్రావిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్‌కు చోటు దక్కింది. ఈ జట్టుకు  ధీరజ్ జె. గౌడ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. ధృవ్ ప్రభాకర్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. అక్టోబర్ 12 నుండి 20 వరకు హైదరాబాద్‌ వేదికగా ఈ టోర్నీ జరగనుంది.

వినూ మన్కడ్ ట్రోఫీ కర్ణాటక జట్టు: ధీరజ్ జె గౌడ(కెప్టెన్‌), సమిత్ ద్రవిడ్, కార్తీక్, హర్షిల్ ధర్మాని, శివమ్, ధువ్ ప్రభాకర్, హార్దిక్ రాజ్, యువరాజ్ అరోరా (వికెట్ కీపర్), ఆరవ్ మహేష్, ఆదిత్య నాయర్, ధనుష్ గౌడ, సమర్థ్ షెడ్ నాగరాజ్, శిఖర్ షెడ్ నాగరాజ్, కైవల్య మిశ్రా.